ఎగసి పడే కెరటం నేను
నేను చేరే తీరం నువ్వు
పున్నమి కాంతి నీవు
నీ ప్రతిబింబం దాచుకుంది నేను
సాగరం లోతు వంటి ప్రేమ నాది
పిడికిలిలో ఇసుక వంటి తత్వం నీది
మదిలో భావాలు అలలై ఎగసింది
అది తెలిసి నీ చిరునవ్వు అలాగే నిలిచింది
సముద్రం వెన్నంటి ఉండే తీరం లా
బ్రతికిస్తావా నన్ను ప్రణయ ఊపిరిలా