ఇక్కడ పొందుపరిచిన కవితలన్నీ నాలో ఎగిసిన భావోద్వేగాలకు ప్రతి రూపాలు
పత్రికల్లోనో టీవీ లోనో కనిపించిన న్యూస్ ప్రకారం
అప్పటికప్పుడు రాసినవి కొన్ని... మిగిలినవి ఫ్రెండ్స్ అడిగారని రాసిచ్చినవి
మీకు నచ్చుతాయని ఆశిస్తూ
రూప
Saturday, February 13, 2010
నలు వైపులా ప్రణయ గాలులు వీస్తుండగా
చల్లటి నీ కను చూపులలో సేద తీరాలని ఆరాట పడుతున్న నాకు
నీ వెచ్చని సాంగత్యం అందించవా ప్రియతమా !!
నీకై వేచి చూసే నీ ప్రియసఖిని కానవా ?