Monday, December 13, 2010

ashtavadhanam by me :D words given by my brother in train..while playing rummy :P

పదాలు ఇచ్చినవి రాజయోగం, ధ్వజం, స్వరం, కీర్తనం.

రాజయోగం వచ్చునని చేరిన నాయకులు
వ్యతిరేకముగా ధ్వజమెత్తిన వారిపై
స్వరమెత్తి మరీ తిట్టుదురే ! ఔరా
ఈ నాయకులనా మనం చెసేది కీర్తనం

Monday, October 11, 2010

ఎగసి పడే కెరటం నేను
నేను చేరే తీరం నువ్వు

పున్నమి కాంతి నీవు
నీ ప్రతిబింబం దాచుకుంది నేను

సాగరం లోతు వంటి ప్రేమ నాది
పిడికిలిలో ఇసుక వంటి తత్వం నీది

మదిలో భావాలు అలలై ఎగసింది
అది తెలిసి నీ చిరునవ్వు అలాగే నిలిచింది

సముద్రం వెన్నంటి ఉండే తీరం లా
బ్రతికిస్తావా నన్ను ప్రణయ ఊపిరిలా
ప్రాంతీయాభిమానం అన్నరు
వందల ప్రాణాలు పొయాయన్నారు
చివరకి ఏం సాధించారు ?
ఆయిన వాళ్ళకి కన్నీళ్ళు మిగిల్చారు !

Saturday, February 13, 2010

నలు వైపులా ప్రణయ గాలులు వీస్తుండగా
చల్లటి నీ కను చూపులలో సేద తీరాలని ఆరాట పడుతున్న నాకు
నీ వెచ్చని సాంగత్యం అందించవా ప్రియతమా !!
నీకై వేచి చూసే నీ ప్రియసఖిని కానవా ?