▓▓▓▓▓▓▓▓▓█※۩૪※Roopa※૪۩※█▓▓▓▓▓▓▓▓▓▓
ఇక్కడ పొందుపరిచిన కవితలన్నీ నాలో ఎగిసిన భావోద్వేగాలకు ప్రతి రూపాలు పత్రికల్లోనో టీవీ లోనో కనిపించిన న్యూస్ ప్రకారం అప్పటికప్పుడు రాసినవి కొన్ని... మిగిలినవి ఫ్రెండ్స్ అడిగారని రాసిచ్చినవి మీకు నచ్చుతాయని ఆశిస్తూ రూప
Sunday, June 3, 2007
Hi Friends..
ఆందరికి నమస్సుమాంజలి... నా కవితాలోకానికి స్వాగతం సుస్వాగతం.. ఇక్కడ అందరికి ఊహల రెక్కలు రావాలని నా కోరిక.. నేను నా భావాలను రాశాను చాలా సరళమైన భాష లో.. తప్పులు ఏదైనా ఉంటే మన్నించి సరిచేయగలరని ఆశిస్తు...
▓▓▓▓▓▓▓▓▓█※۩૪※Roopa※૪۩※█▓▓▓▓▓▓▓▓▓▓
▓▓▓▓▓▓▓▓▓█※۩૪※Roopa※૪۩※█▓▓▓▓▓▓▓▓▓▓
Nenu Raasina Konni Aasukavitalu..!
..:*♥*:._.:*♥*:._.:*♥*:._.:*♥*:..♥..:*♥*:._.:*♥*:._.:*♥*:._.:*♥*:..
మది ని మౌనం తాకితే రాలేది కవితాక్షరాలే పరిచయ పరిమళాలు వీస్తే విరబూసేది స్నేహ మాధుర్యాలే..!
..:*♥*:._.:*♥*:._.:*♥*:._.:*♥*:..♥..:*♥*:._.:*♥*:._.:*♥*:._.:*♥*:..
బుడి బుడి అడుగులు నేర్పి, చిట్టి చిట్టి కథలు చెప్పి హాయిగా ఒడిలో పడుకోబెట్టుకుని మానవత్వం ,సంస్కారం నేర్పిన మాతృ మూర్తి కి పాదాభి వందనం..!..:*♥*:._.:*♥*:._.:*♥*:._.:*♥*:..♥..:*♥*:._.:*♥*:._.:*♥*:._.:*♥*:..
బాధ కలిగిన వేళ ఒడిలో, ఆనందం కలిగిన వేళ చేతిలో కష్టం వచ్చిన వేళ మనసులో, ఎల్ల వేళళా కన్నుల్లో దాచుకున్న మాతృ మూర్తి కి హ్రుదయపూర్వక శతకోటి నమస్సులు...!
వినీలాకాశం లో నీలి వెన్నెలను జాబిల్లి వర్ణించు వేళ తోట లోని మల్లెజాజుల మేళవింపు పరిమలించు వేళ నడకకు లయ గా కదిలి... ఆ మువ్వలు రవళిస్తున్న వేళ చిరు చలి గాలికి నా అధరలు అదిరి పడుతున్న వేళ ణా లో ఎగిసిన భావోద్వెగేలకు చిహ్నమే ఈ నా చిన్ని కవిత..!
మది ని మౌనం తాకితే రాలేది కవితాక్షరాలే పరిచయ పరిమళాలు వీస్తే విరబూసేది స్నేహ మాధుర్యాలే..!
పులకరించే ప్రతి సూర్యోదయం నీ రాకకై ఎదురుచూస్తుంటే పలకరించే ఈ హ్రుదయం నీ ఎదలో సేద తీరాలని కోరుతోంది..!
..:*♥*:._.:*♥*:._.:*♥*:._.:*♥*:..♥..:*♥*:._.:*♥*:._.:*♥*:._.:*♥*:..
గాడాంధకారాన్ని చీల్చి చల్లని శశికిరణాలు ప్రసరింపజేయు చంద్ర బింబమున గాంచితి నీ ముఖారవిందము ; నీకై వేచి ఉన్న నా మనసు ని నీకు ఎలా తెలియజేయను ?ఆశల ఆకాశం లో కష్ట సుఖాల మేఘాల నడుమ దాగీ దాగక అందీ అందక కనిపించే రవికిరణాలే అదృష్ట కిరణాలు.. మెరుపై ధైర్యం తో నిలిచిన వారికే చిరు జల్లై అవకాశాలు కురిపించేను..!
నా హృదయం లో ఏ ప్రేమామృతం వొలికించావో నా జీవనాకాశం లో విరిసిన చంద్రకిరణమా !!!! నీకై వేచి ఉన్న నా ఊసులకి నీ ఒడి లో చోటు దొరికేదెన్నడో ?
Subscribe to:
Posts (Atom)