Sunday, June 3, 2007

Hi Friends..

ఆందరికి నమస్సుమాంజలి... నా కవితాలోకానికి స్వాగతం సుస్వాగతం.. ఇక్కడ అందరికి ఊహల రెక్కలు రావాలని నా కోరిక.. నేను నా భావాలను రాశాను చాలా సరళమైన భాష లో.. తప్పులు ఏదైనా ఉంటే మన్నించి సరిచేయగలరని ఆశిస్తు...


▓▓▓▓▓▓▓▓▓۩૪※Roopa※૪۩※▓▓▓▓▓▓▓▓▓▓

Nenu Raasina Konni Aasukavitalu..!

..:**:._.:**:._.:**:._.:**:....:**:._.:**:._.:**:._.:**:..
బుడి బుడి అడుగులు నేర్పి, చిట్టి చిట్టి కథలు చెప్పి హాయిగా ఒడిలో పడుకోబెట్టుకుని మానవత్వం ,సంస్కారం నేర్పిన మాతృ మూర్తి కి పాదాభి వందనం..!


బాధ కలిగిన వేళ ఒడిలో, ఆనందం కలిగిన వేళ చేతిలో కష్టం వచ్చిన వేళ మనసులో, ఎల్ల వేళళా కన్నుల్లో దాచుకున్న మాతృ మూర్తి కి హ్రుదయపూర్వక శతకోటి నమస్సులు...!

..:**:._.:**:._.:**:._.:**:....:**:._.:**:._.:**:._.:**:..

వినీలాకాశం లో నీలి వెన్నెలను జాబిల్లి వర్ణించు వేళ తోట లోని మల్లెజాజుల మేళవింపు పరిమలించు వేళ నడకకు లయ గా కదిలి... ఆ మువ్వలు రవళిస్తున్న వేళ చిరు చలి గాలికి నా అధరలు అదిరి పడుతున్న వేళ ణా లో ఎగిసిన భావోద్వెగేలకు చిహ్నమే ఈ నా చిన్ని కవిత..!


మది ని మౌనం తాకితే రాలేది కవితాక్షరాలే పరిచయ పరిమళాలు వీస్తే విరబూసేది స్నేహ మాధుర్యాలే..!


పులకరించే ప్రతి సూర్యోదయం నీ రాకకై ఎదురుచూస్తుంటే పలకరించే ఈ హ్రుదయం నీ ఎదలో సేద తీరాలని కోరుతోంది..!


..:**:._.:**:._.:**:._.:**:....:**:._.:**:._.:**:._.:**:..

గాడాంధకారాన్ని చీల్చి చల్లని శశికిరణాలు ప్రసరింపజేయు చంద్ర బింబమున గాంచితి నీ ముఖారవిందము ; నీకై వేచి ఉన్న నా మనసు ని నీకు ఎలా తెలియజేయను ?

ఆశల ఆకాశం లో కష్ట సుఖాల మేఘాల నడుమ దాగీ దాగక అందీ అందక కనిపించే రవికిరణాలే అదృష్ట కిరణాలు.. మెరుపై ధైర్యం తో నిలిచిన వారికే చిరు జల్లై అవకాశాలు కురిపించేను..!

నా హృదయం లో ఏ ప్రేమామృతం వొలికించావో నా జీవనాకాశం లో విరిసిన చంద్రకిరణమా !!!! నీకై వేచి ఉన్న నా ఊసులకి నీ ఒడి లో చోటు దొరికేదెన్నడో ?

Wednesday, May 30, 2007

Inkonni Kavitalu..!


..:**:._.:**:._.:**:._.:**:....:**:._.:**:._.:**:._.:**:..
నీ కొప్పు లోని సన్నజాజులు మురిసిపొతుండగా.. అలవోకన నీ వాలు జడనుపట్టి వయ్యారం గా నడుస్తు వెల్తున్న వేళ ఓ సుకుమారీ... నీ పాదముల కింది పూబాటను కాకపొతినే అని.. నేను చింతిస్తున్న వేళ నాకు తెలిసింది... నేనే నీ జీవితపు బాటనని..!

గాలిలోని పరిమళంలా వేణువులోని నాదంలా మౌనంలొ ని నిశ్శబ్దంలా నా మది నిన్ను చేరుకోవాలి...

చిరు గాలి వీస్తుండగా కృష్ణ వర్ణం లో మారిన.. ఆ నింగి మదిలో ఎగిసిపడిన భావాలను జల్లు గా కురిపించాలని అనుకున్నా.. కాని అప్పుడే తెలిసింది నా మది లోని భావాలు.. చిరు జల్లు కాదు..రివ్వున వీచే తుపాను గాలులని.. వాటిని ఎవరూ ఆపలేరని..!

 


మనసు గాయపడి ఏకాంత సాగరం లో మునిగి తేలినప్పుడు.. బరువెక్కిన గుండెలో నిరాశల శ్వాస నిశ్వాసల మధ్య ఆకాశం వైపు చూస్తున్న వేళ.. నా హృదయం లో ఆనంద ఆలపన చేసేదే ఈ మన స్నేహం..!



..:**:._.:**:._.:**:._.:**:....:**:._.:**:._.:**:._.:**:..

About Dowry

భావమును చెప్పాలనుకున్నా.. మూగ గొంతుకు తావేదీ ? కనుసైగతో చూపెడదామనుకున్నా.. గుడ్డి కళ్ళకి చూపేదీ ? ముందు నడిచి నడిపించాలనుకున్నా.. అవిటి కాళ్ళకి నడకేదీ ? ఈ తరం యువతికి స్వేఛ్ఛా గీతం వినపడే రోజేదీ ?

About Child Labour

అహం ఎరుగని నిర్మల హృదయం.. కోపం ఎరుగని శాంత స్వభావం.. మోసం తెలియని పసి హృదయం భావి భారతం.. గుర్తించక కాల రాయడం ఎంత వరకు సమంజసం..!


About Oldage Home's

చిన్ననాడు పట్టి నడక నేర్పిన చేయి.. పరీక్షనాడు వెన్ను తట్టి ఆశీర్వదించిన చేయి.. మరొకరిని చేతిలొ పెట్టి సుఖపెట్టిన చేయి.. నేడు ఆర్తి గా అనాథ గా దిక్కుతోచక బిక్కు బిక్కుమంటోంది.. ఇదేనా మన సాంప్రదాయం ?..!
..:**:._.:**:._.:**:._.:**:....:**:._.:**:._.:**:._.:**:..

About Tsunami

నీలి నింగి ఆగ్రహించిన వేళ వేల ఆర్తనాదాలు వినిపించిన వేళ ప్రశాంత పైటని జార్చి బీభత్సపు ముసుగు ధరించి... నదీమ తల్లులు ఆదిన రాసకేళి లో ఎన్ని జీవితాలు ఓడిపోయాయో కదా

సాగర కెరటం లా.. నాలో ఆనందం ఉవ్వెత్తున ఎగసి పడి నిశ్శబ్దం గా.. మది లో ఒక సంతోషపు వెల్లువ నిస్క్షిప్తమవుతోంది ఎగిసిపడి ఊగిసలాడే ఈ మనహ్సాగరం లో స్వాతి చినుకై దొరికిన నీ స్నేహం మేలిమి ముత్యమై.. ఎప్పటికీ ఇలాగే మెరిసిపోవాలని కొరుతూ............. రూప


కారు మబ్బుల్లా, చిరు చీకట్ల లా మనసులో ముసిరిన భావోద్వేగములు అణచి వేసిన తరుణం లో కెరటం లా ఎగిసింది ఈ నా కవితా సగరం...


బాధ వెంటే సంతోషం చీకటి వెంతే వెలుగు కష్టాల వెంతే సుఖం అన్నీ జీవితమనే నాణానికి రెండు ముఖాలు

లోతైన సాగరం లా, అంతు లేని నింగి లా గజి బిజి అల్లికలా మల్లెపూవు స్వచ్చత లా మంచు కంటే చల్ల గా నివురు గప్పిన నిప్పులా ఎవరికీ అర్థం కాని పొడుపు కథ అతివ మనోగతం...