Friday, March 18, 2011

nenu raasina tholi paata.. evaraina tune kadithe baaguntundi :)

ఎగిసే ఎగిసే నాలో ప్రణయం తొలిసారిగా కలత పడే హ్రుదయం తననే చూడని వేళ తననే చేరని పూట తన ఊహేలే ఎదలో అనుదినం లలనా నీ మాటలే సరిగమఝరులు నీ నవ్వులే ఇక నా ఊపిరి ప్రాణాలు నీవే లేని వెళ నా ప్రేమే లేదు అంతా నిన్నే చూసిన వెళ పండుగలేగా


2 . నీ కొసమే వెతికి నే చేరానే నీ వాకిటి ముందుకి నే బదులు కోసం ఎదురే చూస్తున్నా కరుణిస్తావని నే ఆశ తొ ఉన్ననే మగువా దరి చేరి ఓ సారి కనవే నా ప్రేమా నీ కోసం ఏదేమైనా నేను చేసేస్తానే బొమ్మ వయ్యారీ నీవే ఇంక నా జీవితం
నా ప్రాణాలన్నీ నీకే అంకితమంటున్నానే 
నా అణువణువు నీవేలే నా లోకం నువ్వే
దిగి రావే కదలి రా.............

Monday, December 13, 2010

ashtavadhanam by me :D words given by my brother in train..while playing rummy :P

పదాలు ఇచ్చినవి రాజయోగం, ధ్వజం, స్వరం, కీర్తనం.

రాజయోగం వచ్చునని చేరిన నాయకులు
వ్యతిరేకముగా ధ్వజమెత్తిన వారిపై
స్వరమెత్తి మరీ తిట్టుదురే ! ఔరా
ఈ నాయకులనా మనం చెసేది కీర్తనం

Monday, October 11, 2010

ఎగసి పడే కెరటం నేను
నేను చేరే తీరం నువ్వు

పున్నమి కాంతి నీవు
నీ ప్రతిబింబం దాచుకుంది నేను

సాగరం లోతు వంటి ప్రేమ నాది
పిడికిలిలో ఇసుక వంటి తత్వం నీది

మదిలో భావాలు అలలై ఎగసింది
అది తెలిసి నీ చిరునవ్వు అలాగే నిలిచింది

సముద్రం వెన్నంటి ఉండే తీరం లా
బ్రతికిస్తావా నన్ను ప్రణయ ఊపిరిలా
ప్రాంతీయాభిమానం అన్నరు
వందల ప్రాణాలు పొయాయన్నారు
చివరకి ఏం సాధించారు ?
ఆయిన వాళ్ళకి కన్నీళ్ళు మిగిల్చారు !

Saturday, February 13, 2010

నలు వైపులా ప్రణయ గాలులు వీస్తుండగా
చల్లటి నీ కను చూపులలో సేద తీరాలని ఆరాట పడుతున్న నాకు
నీ వెచ్చని సాంగత్యం అందించవా ప్రియతమా !!
నీకై వేచి చూసే నీ ప్రియసఖిని కానవా ?

Monday, October 26, 2009

ఈ క్షణం am missing you

ఒంటరిగా కూర్చున్న వేళ
ప్రశాంత నిశ్శబ్ద వీధిలో
నీతో చెప్పాలనుంది
ఈ క్షణం am missing you

కన్నీరు జాలువారుతున్న వేళ తలవాల్చడానికి నీవు లేని వేళ
నీతో చెప్పాలనుంది
ఈ క్షణం am missing you

చలికాలం మంచులో
వెచ్చటి ఒక నేస్తం కరువైనపుడు
నీతో చెప్పాలనుంది
ఈ క్షణం am missing you

కారు చీకట్ల బాధల్లో
వెలుగు లాంటి ఒక ఆసరా లేని సమయం లో
నీతో చెప్పాలనుంది
ఈ క్షణం am missing you

Saturday, March 28, 2009

this was written when my madam asked me to write on a student......


భవిత పై ఆశలు, ఎన్నో సంశయాలు ఎదో సాధించలన్న తపన, ఆశలు ఆశయాలు సరదాలు కోరికలు, పరీక్షల భయాలు , అన్నీ కలిసిన విద్యార్థి జీవితం ఒక అద్భుతం !!